-
-
Home » Telangana » Rangareddy » We will develop with the cooperation of MLA Anand-MRGS-Telangana
-
ఎమ్మెల్యే ఆనంద్ సహకారంతో అభివృద్ధి చేస్తాం
ABN , First Publish Date - 2022-09-13T05:30:00+05:30 IST
ఎమ్మెల్యే ఆనంద్ సహకారంతో అభివృద్ధి చేస్తాం

వికారాబాద్, సెప్టెంబరు 13 : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ సహకారంతో వికారాబాద్ మునిసిపాలిటీని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామని మాజీ మునిసిపల్ చైర్‌పర్సన్, ప్రస్తుత కౌన్సిలర్ లంకా పుష్పలతారెడ్డి అన్నారు. మంగళవారం మునిసిపల్ పరిధిలోని మూడవ వార్టులో రూ.5లక్షలతో నిర్మించబోయే కమ్యూనిటీ హాల్‌కు స్థానిక కౌన్సిలర్లు మంజుల, అనంత్‌రెడ్డిలతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వికారాబాద్ మునిసిపాలిటీలో అభివృద్ధిపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించారన్నారు. టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలోనే అన్నిరంగాలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, కో-ఆప్షన్ సభ్యులు షకీల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, మైనార్టీ ప్రెసిడెంట్ సయ్యద్ జాయినుద్దీన్, గ్రామస్తులు తెలిపారు.