కలెక్టరేట్‌ ముట్టడితో అలజడి సృష్టిస్తాం

ABN , First Publish Date - 2022-11-16T23:47:18+05:30 IST

ధరణి పోర్టల్‌ సమస్యలపై వికారాబాద్‌ కలెక్టరేట్‌ను ముట్టడించిహైదరాబాద్‌ సెక్రటేరియట్‌లో అలజడి సృష్టిస్తామని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ అన్నారు.

కలెక్టరేట్‌ ముట్టడితో అలజడి సృష్టిస్తాం
కార్యక్రమంలో మాట్లాడుతున్న అద్దంకి దయాకర్‌, దీక్షలో కూర్చున్న గడ్డం ప్రసాద్‌కుమార్‌

‘ధరణి’ సమస్యలపై ప్రజా ఉద్యమం

కాంగ్రెస్‌ ప్రభుత్వమొస్తే అక్రమార్కులు జైలుకే

ప్రసాద్‌కుమార్‌ దీక్షలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌

వికారాబాద్‌, నవంబరు 16: ధరణి పోర్టల్‌ సమస్యలపై వికారాబాద్‌ కలెక్టరేట్‌ను ముట్టడించిహైదరాబాద్‌ సెక్రటేరియట్‌లో అలజడి సృష్టిస్తామని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ అన్నారు. ధరణి సమస్యలు పరిష్కరించాలని బుధవారం మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష చేపట్టారు. ముఖ్య అతిథిగా వచ్చిన దయాకర్‌ మాట్లాడుతూ.. ధరణి సమస్యలపై ప్రసాద్‌కుమార్‌ ఉద్యమం ప్రారంభించారన్నారు. ధరణి మోసాలపై రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ పోరాటం చేపడుతు ందన్నారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు పేదలకు 23లక్షల ఎకరాలు పంచాయన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వాటిని లాక్కొని అమ్ముకుంటోందన్నారు. ధరణి పేరుతో మోసం చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి రెవెన్యూ వ్యవస్థను నాశనం చేశారన్నారు. భూ హక్కులకు రక్షణ లేకుండా చేశారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే ధరణి వ్యవస్థను రద్దుచేస్తామన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ రెండూ ఒకటేన న్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి డీజిల్‌, పెట్రోల్‌పై యేటా రూ.50వేల కోట్ల ఆదాయం వస్తోందన్నా రు. గల్లీగల్లీలో బెల్టు షాపులు పెట్టి ప్రజలను తాగుబోతులను చేస్తున్నారన్నారు. మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌ మాట్లాడుతూ.. ధరణి పేరుతో తెచ్చింది ‘దొరణి’ అని కేసీఆర్‌ దొర పాలననే ఈ ‘దొర’ణి అని అన్నారు. ధరణి ప్రతీ సమస్యపై మీ-సేవల్లో రైతులు రూ.2,500 చెల్లిస్తుంటే కావాలని ఆన్‌లైన్లో రిజక్ట్‌ కొడుతున్నారని.. దీంతో రైతులు మళ్లీమళ్లీ రూ.2,500 చెల్లిస్తున్నారని తెలిపారు. ఈ డబ్బంతా ప్రభుత్వ ఖజానాకు జమైతుందన్నారు. రాష్ట్రంలో లక్షలాది మంది రైతులను ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. వికారాబాద్‌ కలెక్టర్‌ అవినీతిపై తాను పదిసార్లు ఫిర్యాదు చేసినా ప్రభు త్వం పట్టించుకోవడం లేదన్నారు. జిల్లాలో 12వేల ధరణి అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వారం రోజుల్లో వాటిని పరిష్కరించకుంటే 10వేల మందితో కలెక్టరేట్‌ను ముట్టడిస్తా మని హెచ్చరించారు. కేసీఆర్‌ కుటుంబీకులు రాష్ట్ర వ్యాప్తంగా లావణిపట్టా భూములను గుర్తించి తక్కువ ధరకు కొని రూ.కోట్లకు అమ్ముకుంటున్నారని తెలిపారు. నవాబుపేట మండలం ఆర్కతల వద్ద 800 ఎకరాలను ఇలాగే కొని అమ్మారని చెప్పారు. ప్రస్తుతం ఎన్కతలవద్ద అమ్మకానికి చూస్తున్నారని, ఈ భూములపై తాము హైకోర్టుకు పోతామన్నారు. ప్రభుత్వం లాక్కున్న భూములను కాంగ్రెస్‌ ప్రభుత్వంవచ్చిన వెంటనే రైతులకు అప్పగిస్తామన్నారు. అసైన్డ్‌ రైతులకు పూర్తి హక్కులు కల్పించి వారు భూమి అమ్ముకునే, కొనే చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చారు. బుధవారం మా ర్కెట్‌ యార్డులో ప్రభుత్వం నిర్వహించిన సభలో వికారాబాద్‌ ఎమ్మెల్యే ఆనంద్‌ను ఉద్దేశించి వారి ఎంపీ రంజిత్‌రెడ్డి.. ‘ఆనంద్‌ నువ్వు మెడిసిన్‌ చేశావా? లేక పిట్టకథలు నేర్చుకున్నావా?’అని అన్నారని ఎద్దేవాచేశారు. ఎమ్మెల్యే ఆనంద్‌ పిట్ట కథలకే పనికొస్తారన్నారు. త్వరలోనే వికారాబాద్‌ ఎమ్మెల్యే అవినీతి చిట్టా విప్పుతానన్నారు. ప్రసాద్‌కుమార్‌కు దయాకర్‌ సాయంత్రం నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ సత్యనారాయణ, జడ్పీటీసీ సంతోష, సీనియర్‌ నాయకులు కిషన్‌నాయక్‌, రత్నారెడ్డి, రాములు, అయూబ్‌ అన్సారీ, నర్సిములు, మహిపాల్‌రెడ్డి, అనంత్‌రెడ్డి, కృష్ణారెడ్డి, పార్టీ మండలాల అధ్యక్షులు రవీందర్‌, వెంకటేశ్‌, వాయిద్‌ మియా, రాజశేఖర్‌రెడ్డి, శంకర్‌, రఘువీరారెడ్డి, కౌన్సిలర్లు వేణుగోపాల్‌రెడ్డి, మురళి, ఆసిఫ్‌, నాయకులు రఘుపతిరెడ్డి, సతీ్‌షరెడ్డి, వెంకట్‌రెడ్డి, భూపతిరెడ్డి, సంతో్‌షగౌడ్‌, శ్రీను, నర్సింహారెడ్డి, రజనీకాంత్‌, బాలకృష్ణ, హన్మంతు, జంగయ్య పాల్గొన్నారు.

Updated Date - 2022-11-16T23:47:19+05:30 IST