మహనీయుల స్ఫూర్తితో ముందుకు సాగాలి

ABN , First Publish Date - 2022-10-15T04:38:39+05:30 IST

మహనీయుల స్ఫూర్తితో ముందుకు సాగాలి

మహనీయుల స్ఫూర్తితో ముందుకు సాగాలి
మహనీయులకు నివాళులర్పిస్తున్నప్రజాప్రతినిధులు, నాయకులు

ఆమనగల్లు, అక్టోబరు 14: మహానీయుల స్ఫూర్తితో ముందుకు సాగి సమాజంలో మార్పునకు కృషి చేయాలని అంబేడ్కర్‌, పూలే జ్ఞాన ప్రచారసభ వ్యవస్థాపకులు నల్ల బాబు, ఎల్‌హెచ్‌పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దాసురామ్‌ నాయక్‌, సీఐ జాల ఉపేందర్‌, అంబేడ్కర్‌, పూలే జాతర కమిటీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ జి.సుధాకర్‌, జడ్పీటీసీ అనురాధపత్యనాయక్‌లు అన్నారు. అంబేడ్కర్‌, పూలే జ్ఞాన జాతర కమిటీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలోని కళ్యాణి గార్డెన్‌లో శుక్రవారం అంబేడ్కర్‌, పూలే జ్ఞాన జాతర సభ నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్దుడు, అంబేడ్కర్‌, పూలే, మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.  ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కొమ్ము తిరుపతి, పంచాయతీ చాంబర్‌ రాష్ట్ర కార్యదర్శి యాచారం వెంకటేశ్వర్లుగౌడ్‌, అంబేద్కర్‌ పూలే జాతర కమిటీ జిల్లా అధ్యక్షుడు దరువుల శంకర్‌, రాము పాల్గొన్నారు.   

Read more