-
-
Home » Telangana » Rangareddy » Vishwakarma Jayanti-NGTS-Telangana
-
ఘనంగా విశ్వకర్మ జయంతి
ABN , First Publish Date - 2022-09-19T05:45:42+05:30 IST
ఘనంగా విశ్వకర్మ జయంతి

షాద్‌నగర్/చౌదరిగూడ/షాద్‌నగర్, సెప్టెంబరు 18: పట్టణంలో విశ్వకర్మ జయంతి ఉత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి వరకు విశ్వకర్మలు హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం స్థానిక శివమారుతి గీతా అయ్యప్ప మందిరం నుంచి ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలపై విశ్వకర్మ, వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహాలను ఊరేగించారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు, పెద్ద ఎత్తున హోమాలు నిర్వహించారు. పూజలు, హోమాల అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, బీజేపీ నాయకులు పాలమూరు విష్ణువర్దన్‌రెడ్డి, విశ్వకర్మ సంఘం అధ్యక్షులు కొందూటి రవిచారి, కార్పెంటర్ సంఘం అధ్యక్షులు శ్రీనివాసచారి, జి.నర్సింహాచారి, మేడిపల్లి గోపాలచారి, మధుసూధన్చారి, అశోకచారి, గోవర్దనచారి, డిస్కో శ్రీను, నర్సింహాచారి, రమే్‌షచారి, ఎస్.నర్సింహాచారి, వంశీకృష్ణ, కమ్మరి అశోక్, కొత్తకోట రాజు, ఎర్రవల్లి శ్రీను, రవి, భీమయ్యచారి, జగదీశ్వర్, రాజేశ్, సుధాకర్, దినప్పచారి, గణేష్, రాజు పాల్గొన్నారు. అదేవిధంగా చౌదరిగూడలో రావిర్యాల గ్రామంలో గురుజపు ఫామ్స్ ఆధ్వర్యంలో వేదపండితులు బ్రహశ్రీ వేద రత్న సిద్దాంతి నాగేశ్వర్రావు మహాయజ్ఞమహోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం జెండా అవిష్కరించారు. ముఖ్య అతిథిగా బ్రహ్మంగారి మఠం 8వ తరం మునిమనవడు వీరభద్రచారి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శివకుమార్, డాక్టర్ మలికార్జున్రావు, ఉమామహేశ్వరచారి, సర్పంచ్ భూపాల్చారి, సత్యనారాయణరెడ్డి, రాజు, ఆంజనేయులు, వెంకటేష్, వెంకట్‌నర్సింహారెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు.
షాద్‌నగర్ వాసికి విశ్వకర్మ జాతీయ అవార్డు
షాద్‌నగర్, సెప్టెంబరు 18 : పట్టణానికి చెందిన రమేష్ చారి అనే వ్యక్తికి విశ్వకర్మ జాతీయ పురస్కారం లభించింది. ఆదివారం వరంగల్‌లో విశ్వకర్మ జయంతి రోజున ఈ అవార్డు అందుకున్నారు. కళారంగంలో విశేష సేవలు అందించినందుకు గానూ ఈ పురస్కారాన్ని అందజేశారు.