వైభవంగా వేణుగోపాలస్వామి రథోత్సవం

ABN , First Publish Date - 2022-02-17T04:35:59+05:30 IST

వైభవంగా వేణుగోపాలస్వామి రథోత్సవం

వైభవంగా వేణుగోపాలస్వామి రథోత్సవం

ఘట్‌కేసర్‌ రూరల్‌, ఫిబ్రవరి 16 : ఘట్‌కేసర్‌ మండలం, ఎదులాబాద్‌లోని రుక్మిణీ, సత్యభామ శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయ వార్షికబ్రహోత్సవాలలో భాగంగా బుధవారం సాయంత్రం స్వామివారి రథోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం స్వామివారికి, అమ్మవారికి సేవాకాలము, ప్రాభోధకి, ఆరగింపు కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం రఽథాన్ని విద్యుత్‌ దీపాలను ఆలంకరించి స్వామివారిని, అమ్మవారిని ఆహ్వానించారు. గోవింద... గోవిందా అంటు రథాన్ని లాగారు. రథోత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలుఆ కట్టుకున్నాయి కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు అంబారిపేట యాదగిరిచార్యులు, వరదరాజులు, రాంప్రసాద్‌చార్యులు, నన్నయ్యచార్యులు పాల్గొన్నారు. 

Read more