కనులపండవగా వేంకటేశ్వరస్వామి రథోత్సవం

ABN , First Publish Date - 2022-04-06T04:47:42+05:30 IST

కనులపండవగా వేంకటేశ్వరస్వామి రథోత్సవం

కనులపండవగా వేంకటేశ్వరస్వామి రథోత్సవం
కొడంగల్‌ : రథంపై ఊరేగుతున్న వేంకటేశ్వర స్వామివార్లు

కొడంగల్‌/మేడ్చల్‌, ఏప్రిల్‌ 5: కొడంగల్‌లో వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కనులపండువగా కొనసాగుతున్నాయి. మంగళవారం స్వామివారి రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామివారిని చంద్రప్రభ వాహనంపై పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. 

  • ఆకట్టుకున్న బండలాగుడు పోటీలు

వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన బండ లాగుడు పోటీలు ఆకట్టుకున్నాయి. కొడంగల్‌ నియోజకవర్గంలోని దౌల్తాబాద్‌, బొంరాస్‌పేట్‌, కొడంగల్‌ తదితర మండలాలకు చెందిన 40 జతల కాడెద్దులు పోటీలో పాల్గొన్నాయి. కొడంగల్‌ పట్టణవాసి దండ్ల వెంకటయ్యకు చెందిన కాడెద్దుల జత ప్రథమ స్థానంలో నిలిచాయి. దీంతో దౌల్తాబాద్‌ మండలానికి చెందిన యువ నాయకుడు రాజాప్రభాకర్‌ 25 తులాల వెండిని బహుమతిగా అందించారు. ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లు, ఆలయ ధర్మకర్తలు పాల్గొన్నారు. 

  • కనులపండువగా ఎల్లమ్మ కల్యాణం

గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలో ఎల్లమ్మ అమ్మవార్ల ఉత్సవాలు కనులపండువగా నిర్వహిస్తున్నారు. మంగళవారం ఎల్లమ్మ కల్యాణం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మద్దుల లక్ష్మీశ్రీనివాస్‌రెడ్డి దంపతులు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పలువురు కౌన్సిలర్లు, నాయకులు, మేడ్చల్‌ మండలంలోని వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Read more