రథంపై ఊరేగిన వేంకటేశ్వరుడు

ABN , First Publish Date - 2022-05-19T05:13:36+05:30 IST

రథంపై ఊరేగిన వేంకటేశ్వరుడు

రథంపై ఊరేగిన వేంకటేశ్వరుడు


ఘట్‌కేసర్‌రూరల్‌, మే18: మండల పరిధి వెంకటాపూర్‌లోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి సుప్రభాతసేవ, నిత్యహోమం నిర్వహించారు.  అనంతరం రంగురంగుల పూలతో అందంగా ముస్తాబు చేసిన రథోత్సవంపై స్వామివారిని ప్రతిష్ఠించి గ్రామంలో ఊరేగించారు. ఈక్రమంలో స్వామివారికి భక్తులు కొబ్బరికాయాలు, పూలు, పండ్లు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గోవింద నామస్మరణతో వీధులన్ని మార్మోగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌ ఉదారి వేణుగోపాల్‌, ఈవో భాగ్యలక్ష్మి, సర్పంచ్‌ నీరుడి గీతాశ్రీనివాస్‌, ఉపసర్పంచు కట్ట సత్యనారాయణగౌడ్‌పాల్గొన్నారు. 

Read more