వ్యాధుల నివారణకు టీకాలు

ABN , First Publish Date - 2022-11-07T23:17:25+05:30 IST

చిన్న పిల్లల్లో సాధారణంగా వచ్చే వ్యాధుల నివారణకు టీకాల కార్యక్రమాన్ని ఈనెల 7వ తేది నుంచి 19 వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ బి. వెంకటేశ్వర్‌రావు తెలిపారు.

వ్యాధుల నివారణకు టీకాలు
టీకాలు వేస్తున్న జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్‌రావు

రంగారెడ్డి అర్బన్‌/ శంషాబాద్‌ రూరల్‌, నవంబరు 7 : చిన్న పిల్లల్లో సాధారణంగా వచ్చే వ్యాధుల నివారణకు టీకాల కార్యక్రమాన్ని ఈనెల 7వ తేది నుంచి 19 వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ బి. వెంకటేశ్వర్‌రావు తెలిపారు. శంసాబాద్‌ మండలం నర్కూడ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వ్యాధినిరోధక టీకాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు టీకాలు ఇచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రాణాంతకమైన కంఠవాతము, ధనుర్వాతము నుంచి రక్షణ కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలోని 10 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల పిల్లలందరికీ టీకాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జిల్లాలో 2,682 మంది పిల్లలను గుర్తించినట్లు చెప్పారు.

Updated Date - 2022-11-07T23:17:25+05:30 IST

Read more