గుర్తింపు లేని పాఠశాలను మూసివేయాలి

ABN , First Publish Date - 2022-07-07T05:30:00+05:30 IST

గుర్తింపు లేని పాఠశాలను మూసివేయాలి

గుర్తింపు లేని పాఠశాలను మూసివేయాలి
కందుకూరులో ధర్నాలో పాల్గొన్న వినోద్‌చారి

కందుకూరు, జూలై 7: మండల కేంద్రంలో ప్రభుత్వ గుర్తింపులేని ప్రవేటు పాఠశాలలను వెంటనే మూసివేయాలని ఎన్‌ఎ్‌సయూఐ మహేశ్వరం నియోజకవర్గ ఇన్‌చార్జి తల్లోజు వినోద్‌చారి డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలో  గురువారం విద్యావనరుల కేంద్రం ఎదుట ఆసంఘం నేతలతో కలిసి చేపట్టిన ధర్నాలో పాల్గొని మాట్లాడారు. ఐదు సంవత్సరాలుగా మండలంలోని ఇన్‌చార్జి ఎంఈవోగా పనిచేస్తున్న రామానుజన్‌రెడ్డి నిర్వాకం వల్ల మండల పరిధిలో ప్రవేటు పాఠశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందులో భాగంగానే శ్రీచైతన్య విద్యాసంస్థల పేరుతో కొత్తగా పుట్టుకొచినట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో ఆసంఘం నాయకులు రవితేజ, ప్రభాకర్‌, నహీం, సిద్దు, అఖిల్‌, శ్రీకాంత్‌, గణేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-07-07T05:30:00+05:30 IST