ఇద్దరు మహిళలు అదృశ్యం

ABN , First Publish Date - 2022-03-04T05:41:40+05:30 IST

ఇద్దరు మహిళలు అదృశ్యం

ఇద్దరు మహిళలు అదృశ్యం

షాద్‌నగర్‌ రూరల్‌, మార్చి 3: ఇద్దరు మహిళలు అదృశ్యమైన సంఘటనలు షాద్‌నగర్‌ పరిధిలో చోటుచేసుకున్నాయి. పట్టణంలోని శ్రీనగర్‌ కాలనీలో నివాసముండే పెంటమ్మ అనే మహిళ అదృశ్యమైనట్లు ఏఎస్సై రాంచంద్రయ్య తెలిపారు. గత నెల 14న ఇంటి నుంచి ఉదయం బయటికి వెళ్లిన ఆమె ఇప్పటి వరకు తిరిగి రాలేదని వివరించారు. మహిళ భర్త ఎల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా హైదరాబాద్‌లోని హుషీరాబాద్‌ బాపూజీనగర్‌లో నివాసముండే రాధ అనే మహిళ అదృశ్యమైనట్లు ఏఎ్‌సఐ రాంచంద్రయ్య తెలిపారు. గత నెల 22న షాద్‌నగర్‌లోని న్యూసిటీ కాలనీలో నివాసముండే సోదరి ఇంటికి వచ్చి కనిపించకుండా పోయిందని తెలిపారు. బంధువుల ఇళ్లలో వెతికినా జాడ కనిపించకపోవడంతో భర్త రాజు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మహిళల ఆచూకీ తెలిస్తే షాద్‌నగర్‌ పోలీసులకు (08542-252333) సమాచారం ఇవ్వాలని కోరారు.  

Read more