విషపదార్థం కలిపిన కుడిది తాగి రెండు ఆవులు, దూడ మృతి

ABN , First Publish Date - 2022-05-18T05:30:00+05:30 IST

విషపదార్థం కలిపిన కుడిది తాగి రెండు ఆవులు, దూడ మృతి

విషపదార్థం కలిపిన కుడిది తాగి రెండు ఆవులు, దూడ మృతి
చనిపోయిన ఆవు

యాచారం, మే 18: నందివనపర్తిలో బుధవారం విషం కలిసి కుడిది తాగి రూ.3లక్షల విలువైన పాడిపశువులు చనిపోయాయి. పోలీసులు, బాధిత రైతు శేఖర్‌ తెలిపిన వివరాలి లా ఉన్నాయి. రైతు ఉదయం ఏడు గంటల స మయంలో రెండు ఆవుల పాలు పితికి ఇంటికి చేరుకున్నాడు. పదిన్నర సమయంలో పొలం వద్దకు వెళ్లి చూసే సరికి రెండు ఆవులు, ఓ దూడ చనిపోయాయి. అవి తాగిన కుడిదిలో దుండగులు పురుగుల మందు కలపడంతోనే అవి చనిపోయాయని శేఖర్‌ రోదిస్తూ తెలిపాడు. ఆవుల పాలమ్మి కుటుంబాన్ని పోషించుకుంటున్నానని తెలిపాడు. ఆవులు విషం కలిసిన కుడిది తాగి చనిపోయాయా? లేక మరేవిధంగా అనేది అధికారులు విచారణ చేయాలని కోరాడు. మూడు పశువుల పోస్టుమార్టం, ఫోరెన్సిక్‌ రిపోర్టు ఆధారంగా వివరాలు వెల్లడిస్తామని పశువైద్యాధికారి వనజకుమారి తెలిపారు. రైతు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ లింగయ్య చెప్పారు.

Read more