రెండు బైక్‌లు ఢీ.. వ్యక్తికి తీవ్రగాయాలు

ABN , First Publish Date - 2022-05-18T05:44:25+05:30 IST

రెండు బైక్‌లు ఢీ.. వ్యక్తికి తీవ్రగాయాలు

రెండు బైక్‌లు ఢీ.. వ్యక్తికి తీవ్రగాయాలు

మొయినాబాద్‌, మే 17: రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొని ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. మండలంలోని కుత్‌బూద్దీన్‌గూడకు చెందిన ఫిరోజ్‌ మంగళవారం హిమాయత్‌నగర్‌ నుంచి బైక్‌పై తన గ్రామానికి వస్తుండగా చిలుకూరు గ్రామ సమీపంలో ఎదురుగా అజాగ్రత్తగా బైక్‌నడుపుతున్న ఓవ్యక్తి వచ్చి ఢీకొనడంతో  ఫిరోజ్‌కు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని  ఫిరోజ్‌ను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Read more