ద్విచక్రవాహనం దొంగతనం కేసులో ఇద్దరి అరెస్టు

ABN , First Publish Date - 2022-07-03T05:30:00+05:30 IST

ద్విచక్రవాహనం దొంగతనం కేసులో ఇద్దరి అరెస్టు

ద్విచక్రవాహనం దొంగతనం కేసులో ఇద్దరి అరెస్టు

పూడూర్‌, జూలై 3: ద్విచక్రవాహనం దొంగతనం కేసులో ఇద్దరిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు చెన్‌గోముల్‌ ఎస్సై అనిత తెలిపారు. వివరాల్లోకి వెళితే... గత నెల 28న కోయిల్‌కొండ గ్రామానికి చెందిన నందు అనే వ్యక్తి హైదరాబాద్‌ నుంచి సొంత గ్రామం కొత్లబాద్‌కు ద్విచక్రవాహనంపై వెళ్తూ మార్గమధ్యంలో మీర్జాపూర్‌ గేటు సమీపంలో వాహనాన్ని ఆపి మద్యం సేవించాడు. అనంతరం మద్యం మత్తులో ద్విచక్రవాహనాన్ని అక్కడే వదిలిపెట్టి గ్రామానికి వెళ్లాడు. తిరిగి మరుసటి రోజు వచ్చి చూడగా.. అక్కడ వాహనం లేకపోవడంతో చెన్‌గోముల్‌ పోలీ్‌సష్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. శనివారం పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా వాహనం నెంబర్‌ప్లేట్‌ మార్చి వెళ్తుండగా సాయిక్రాంతి, ఫయాజ్‌పాషను పట్టుకొని విచారించగా నిజం తెలిసింది. వారిపై కేసు నమోదుచేసినట్లు ఎస్సై చెప్పారు.

Read more