అన్ని వర్గాలకు అండగా టీఆర్‌ఎస్‌

ABN , First Publish Date - 2022-09-25T05:49:55+05:30 IST

అన్ని వర్గాలకు అండగా టీఆర్‌ఎస్‌

అన్ని వర్గాలకు అండగా టీఆర్‌ఎస్‌
దోమ : కల్యాణలక్ష్మి చెక్కులు అందిస్తున్న ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి

దోమ, సెప్టెంబరు 24 : అన్ని వర్గాలకు టీఆర్‌ఎస్‌ పార్టీ అండగా ఉంటుందని, పేదింటి ఆడపడుచులకు సీఎం కేసీఆర్‌ పెద్దన్నలా కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌లతో ఆర్థిక సాయం అందిస్తున్నారని పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు. శనివారం దోమ రైతు వేదికలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేశారు. ఎంపీపీ అనుసూయ, జడ్పీటీసీ నాగిరెడ్డి, తహసీల్దార్‌ షాహేదాబేగం, సర్పంచ్‌ల సంఘం మండలాధ్యక్షుడు రాజిరెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

  • విద్యార్థులు శ్రద్ధగా చదువుకోవాలి

పూడూర్‌ : విద్యార్థులు శ్రద్ధగా చదువుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు. పూడూరు మండలం ఎన్కెపల్లి మాడల్‌ స్కూల్‌లో నూతన కంప్యూటర్‌ ల్యాబ్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం పదో తరగతి, ఇంటర్మీడియెట్‌లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఎమ్మెల్యే అభినందించి ప్రోత్సాహక బహుమతులు అందించారు. ఎంపీపీ మల్లేశం, జడ్పీటీసీ మేఘమాల ప్రభాకర్‌గుప్త, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ శ్రీదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 

  • గాయపడిన విద్యార్థికి ఎమ్మెల్యే పరామర్శ

దోమ : మండల పరిధిలోని గోడుగోనిపల్లికి చెందిన బోగందస్తమ్మ కుమారుడు గజానంద్‌కు పది రోజులక్రితం టపాసులు కాల్చుతుండగా తీవ్ర గాయాలయ్యాయి. విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే శనివారం బాలుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో మహేశ్‌, సద్ధాం, అంజిలయ్య తదితరులు పాల్గొన్నారు.


Read more