టీఆర్‌ఎ్‌సకు బలమైన ప్రతిపక్షం కాంగ్రెస్‌

ABN , First Publish Date - 2022-03-17T04:21:38+05:30 IST

టీఆర్‌ఎ్‌సకు బలమైన ప్రతిపక్షం కాంగ్రెస్‌

టీఆర్‌ఎ్‌సకు బలమైన ప్రతిపక్షం కాంగ్రెస్‌
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌

వికారాబాద్‌, మార్చి 16: రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి బలమైన ప్రతిపక్షం కాంగ్రెస్‌ పార్టీయేనని, కేసీఆర్‌ కళ్లబొల్లి మాటలను ప్రజలు నమ్మే రోజులు పోయాయని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌ అన్నారు. బుధవారం వికారాబాద్‌లోని సత్యభారతి ఫంక్షన్‌హాల్‌లో పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అర్ధ సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో డిజిటల్‌ మెంబర్‌షిప్‌ ఎన్రోలర్స్‌కు అభినందన సభ నిర్వహించారు. ముఖ్య అతిథి ప్రసాద్‌కుమార్‌ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అందరికంటే ముందు వికారాబాద్‌ టౌన్‌లో 61 బూత్‌లలో 100కంటే ఎక్కువ సభ్యత్వాలు పూర్తి చేసినందుకు పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, సీనియర్‌ నాయకులకు, ఎన్‌రోలర్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మెంబర్‌షిప్‌ వల్ల ప్రతి ఇంటికీ కార్యకర్తలు, నాయకులు దగ్గరయ్యే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా 61 బూత్‌ ఎన్‌రోలర్స్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు విశ్వనాథం, సత్యనారాయణ, కిషన్‌నాయక్‌, రత్నారెడ్డి, నర్సిములు, అనంత్‌రెడ్డి, కృష్ణారెడ్డి, రఘుపతిరెడ్డి, కౌన్సిలర్లు ప్రభాకర్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, మురళి, ఆసిఫ్‌, రెడ్యానాయక్‌, శ్రీనివాస్‌ ముదిరాజ్‌, పెండ్యాలయ్య, అనంతయ్య, రాజశేఖర్‌ పాల్గొన్నారు.


  • టీఆర్‌ఎ్‌సలోకి నవాబుపేట కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు?

నవాబుపేట: కాంగ్రెస్‌ పార్టీ మండల ఉపాధ్యక్షుడు, అక్నాపూర్‌ సర్పంచ్‌ తలారి అజయ్‌కుమార్‌ టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నట్లు స్థానిక ంగా చర్చ జరుగుతోంది. ఇటీవల నవాబుపేట మండలం అక్నాపూర్‌, చించల్‌పేట, నారెగూడ గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు మంత్రులు రావడంతో టీఆర్‌ఎస్‌ నాయకులు ఫ్లెక్సీలు పెట్టారు. వాటిల్లో కాంగ్రెస్‌ మండల ఉపాధ్యక్షుడి పేరుసైతం ఉండటంతో చర్చించుకున్నారు. అయితే తాను ఏండ్లుగా కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నానని, టీఆర్‌ఎ్‌సలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలో నిజం లేదని అజయ్‌ స్పష్టం చేసి నా ఆయన పార్టీ మార్పుపై జోరుగా చర్చ జరుగుతోంది.

Updated Date - 2022-03-17T04:21:38+05:30 IST