ఉపాధ్యాయులకు సత్కారం

ABN , First Publish Date - 2022-03-17T04:58:06+05:30 IST

ఉపాధ్యాయులకు సత్కారం

ఉపాధ్యాయులకు సత్కారం
సమావేశంలో ఎంపీపీ కమ్లీమోత్యనాయక్‌, జడ్పీటీసీ దశరథ్‌ నాయక్‌

కడ్తాల్‌, మార్చి 16: మండల పరిధిలోని మైసిగండి గిరిజన ఆశ్రమ పాఠశాలలో బుధవారం స్వపరి పాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. సాయంత్రం హెచ్‌డబ్య్లూవో బాల్‌రాజ్‌ అధ్యక్షతన పాఠశాల ఆవరణలో జరిగిన ముగింపు కార్యక్రమానికి ఎంపీపీ కమ్లీమోత్యనాయక్‌, జడ్పీటీసీలు జర్పుల దశరథ్‌ నాయక్‌, అనురాధ, ఎంపీడీవో రామకృష్ణ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మైసిగండి ఆశ్రమ పాఠశాలలో చదివి అదే పాఠశాలకు ఉపాధ్యాయులుగా వచ్చిన పాపయ్య, సంతోష్‌ కుమార్‌లను సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ లచ్చిరామ్‌ నాయక్‌, స్థానిక డీఎన్‌టీ పాఠశాల హెచ్‌ఎం సక్రు నాయక్‌,  ఎల్‌ఐసీ డెవల్‌పమెంట్‌ ఆఫీసర్‌ తావుర్య నాయక్‌ పాల్గొన్నారు. 

పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి 

పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని కడ్తాల జడ్పీటీసీ జర్పుల దశరథ్‌నాయక్‌ అన్నారు. మండలంలోని అన్మా్‌సపల్లి, గాన్గుమర్ల తండా గ్రామపంచాయతీ పారిశుధ్య సిబ్బందికి బుధవారం ఇమ్రాయిస్‌ కంపెనీ సహకారంతో జర్పుల రాధాకృష్ణ చారిటబుల్‌ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచులు శంకర్‌, హంసమోత్యనాయక్‌, ఇమ్రాయిస్‌ కంపెనీ జీఎం విజయ్‌, ఆర్య, మేనేజ్‌మెంట్‌ ప్రతినిధులు చంద్ర, రాజేశ్‌ పాల్గొన్నారు.

Read more