కేసీఆర్‌ డ్రామాలను గిరిజనులు పసిగట్టాలి

ABN , First Publish Date - 2022-09-19T05:43:58+05:30 IST

కేసీఆర్‌ డ్రామాలను గిరిజనులు పసిగట్టాలి

కేసీఆర్‌ డ్రామాలను గిరిజనులు పసిగట్టాలి
యువకులను పార్టీలోకి ఆహ్వానిస్తున్న వీర్లపల్లి శంకర్‌

నందిగామ, సెప్టెంబరు 18: గిరిజనులు, ఆదివాసీలు సీఎం కేసీఆర్‌ డ్రామాలను పసిగట్టాలని, ఎన్నికలకోసం రిజర్వేషన్లను మళ్లీ తెరపైకి తెచ్చాడని కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి వీర్లపల్లి శంకర్‌ అన్నారు. మండలంలోని తాటిగడ్డ తండాలో వినోద్‌నాయక్‌, తౌర్యానాయక్‌ ఆధ్వర్యంలో పలువురు టీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలకు చెందిన గిరిజన యువకులు, మహిళలు ఆదివారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వారికి వీర్లపల్లి శంకర్‌ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌తో పాటు, నియోజకవర్గంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ కుటుంబ పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. గిరిజనులకు 10శాతం రిజర్వేషన్‌ అంటూ కేసీఆర్‌ కొత్త నాటకానికి తెరతీసాడని, ప్రజలు ఎవరూ నమ్మరన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జంగ నర్సింహులు, మాజీ పీఏసీఎస్‌ చైర్మన్‌ జిల్లెల్ల రాంరెడ్డి, ఎంపీటీసీలు కొమ్ము కృష్ణ పాల్గొన్నారు.

Read more