ప్రమోషన్లతో కూడిన బదిలీలు చేపట్టాలి

ABN , First Publish Date - 2022-11-30T00:13:40+05:30 IST

ప్రమోషన్లతో కూడిన బదిలీలను చేపట్టాలని టీఎస్‌ యూటీఎఫ్‌ ఉపా ధ్యాయ ఎమ్మె ల్సీ అభ్యర్థి పాపన్నగారి మాణిక్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

ప్రమోషన్లతో కూడిన బదిలీలు చేపట్టాలి
చేవెళ్లలో ఉపాధ్యాయులతో ఎమ్మెల్సీ అభ్యర్థి మాణిక్‌రెడ్డి

చేవెళ్ల, నవంబరు 29: ప్రమోషన్లతో కూడిన బదిలీలను చేపట్టాలని టీఎస్‌ యూటీఎఫ్‌ ఉపా ధ్యాయ ఎమ్మె ల్సీ అభ్యర్థి పాపన్నగారి మాణిక్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం చేవెళ్ల మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులను కలిశారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 7సంవత్సరాల నుంచి ప్రమోషన్లు, బదిలీలు లేక ఖాళీలు ఏర్పడ్డాయన్నారు. జీవో 317 కారణంగా కొందరు ఉపాధ్యాయులు స్థానికత కోల్పోయి దూరం ప్రాంత పాఠశాలల్లో పనిచేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. నాలుగు రాష్ర్టాలు పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తున్నాయని గుర్తుచేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రాములయ్య, కార్యదర్శి భీమ్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, మల్లేశం, అక్బర్‌, యాదగిరి, గుణవంతు, ప్రవీణ్‌, పరమేశ్వర్‌, గణేశ్‌ తదితరులు ఉన్నారు.

యూటీఎఫ్‌ నూతన కమిటీ ఏర్పాటు

కడ్తాల్‌: యూటీఎఫ్‌ మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఎమ్మార్సీలో ఫెడరేషన్‌ నాయకులు సమావేశమై జిల్లా కార్యదర్శి భగవంత్‌రాజ్‌ సమక్షంలో కమిటీ ఎన్నికలు నిర్వహించారు. మండల అధ్యక్షుడిగా జి.యాదయ్య, ప్రధాన కార్యదర్శి ఎ.మల్లయ్యగౌడ్‌, ఉపాధ్యక్షులు బి.జంగయ్య, కౌసల్య, కోశాధికారి వి.విజయ్‌కుమార్‌, జిల్లా కార్యవర్గ సభ్యులుగా జహాంగిర్‌, మండల కమిటీ సభ్యులుగా 20 మందిని ఎన్నుకున్నారు.

కేజీబీవీ టీచర్లకు హెల్త్‌కార్డులివ్వాలి

కందుకూరు: కస్తూర్బా పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు, సిబ్బందికి హెల్త్‌ కార్డులివ్వాలని యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కె.జంగయ్య డిమాండ్‌ చేశారు. దెబ్బడగూడకు చెందిన గాదె పుష్పలత అనే మహిళ వెల్దండ కేజీబీవీలో పనిచేసేవారు. అనారోగ్యంతో మంగళవారం మృతిచెందారు. ఆమె అంత్యక్రియల్లో జంగయ్య పాల్గొన్నారు.

======

Updated Date - 2022-11-30T00:13:41+05:30 IST