ఉద్యోగులకు బదిలీలు సహజం : ఎంపీపీ

ABN , First Publish Date - 2022-09-08T05:45:25+05:30 IST

ఉద్యోగులకు బదిలీలు సహజం : ఎంపీపీ

ఉద్యోగులకు బదిలీలు సహజం : ఎంపీపీ

ఘట్‌కేసర్‌ రూరల్‌, సెప్టెంబర్‌ 7 : ఉద్యోగులకు బదిలీలు సహజమని ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని అవుషాపూర్‌లో పనిచేసిన కార్యదర్శి ఉమాదేవి బదిలీపై మేడ్చల్‌ మండలంలోని పూడూరుకు బదిలీపై వెళ్ళారు. దీంతో అవుషాపూర్‌ పంచాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్‌ కావేరి ఆధ్వర్యంలో బుధవారం వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ ఉమాదేవి గ్రామానికి ఎంతగానో సేవలందించారని గుర్తుచేశారు. ఉపసర్పంచ్‌ అయిలయ్యయాదవ్‌, వార్డుసభ్యులు రాధ, పద్మ, శ్రీనివా్‌సగౌడ్‌, మల్లేష్‌, వీరేష్‌, కుశలవరెడ్డి, నాయకులు దయాకర్‌రెడ్డి, మశ్చేందర్‌రెడ్డి, సాయిలు, వెంకట్‌రెడ్డి, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 


Read more