బదిలీలు, ప్రమోషన్లు వెంటనే చేపట్టాలి

ABN , First Publish Date - 2022-10-12T05:07:27+05:30 IST

బదిలీలు, ప్రమోషన్లు వెంటనే చేపట్టాలి

బదిలీలు, ప్రమోషన్లు వెంటనే చేపట్టాలి

కొత్తూర్‌, ఆక్టోబరు 11: ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లను వెంటనే చేపట్టాలని పీఆర్‌టీయూటీఎస్‌ జిల్లా అధ్యక్షుడు గోవర్దన్‌యాదవ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల ఆవరణలో మంగళవారం కొత్తూర్‌, నందిగామ మండలాలకు చెందిన ఉపాధ్యాయులకు  ఎమ్మెల్సీ ఎన్నికల ఎన్‌రోల్‌మెంట్‌ ఫామ్స్‌ను గోవర్ధన్‌యాదవ్‌ అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీఆర్‌టీయూటీఎస్‌ రాష్ట్ర శాఖ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుర్రం చెన్నకేశవరెడ్డిని ప్రకటించినట్లు తెలిపారు. పీఆర్‌టీయూ అభ్యర్థి గెలుపునకు ఉపాధ్యాయులు కృషి చేయాలని గోవర్ధన్‌యాదవ్‌ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొత్తూర్‌, నందిగామ మండలాల అధ్యక్షులు ఎం.విజయ్‌సాగర్‌, రాఘవేందర్‌, నాయకులు శ్రీనివా్‌సరెడ్డి, ఆంజనేయులు, ప్రభాస్‌, సోంభూపాల్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.  

Read more