టోల్‌గేట్‌.. త్రివర్ణమయం

ABN , First Publish Date - 2022-08-11T05:03:23+05:30 IST

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో

టోల్‌గేట్‌.. త్రివర్ణమయం
గండిపేట మండలం నార్సింగ్‌, నానక్‌రాంగూడ మధ్యలోని టోల్‌గేట్‌ వద్ద మువ్వన్నెల వెలుగులు

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి  75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ పేరిట కేంద్ర ప్రభుత్వం భారీ కార్యక్రమాలను చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగరవేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ సమయంలో పలు ప్రధాన నిర్మాణాలు త్రివర్ణమయంగా మారాయి. గండిపేట మండలం నార్సింగ్‌, నానక్‌రాంగూడ మధ్యలో ఉన్న టోల్‌గేట్‌ను మువ్వన్నెల జెండా రంగుల వెలుగులు విరజిమ్మేలా విద్యుద్దీపాలను అలంకరించారు.

- ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌, రంగారెడ్డి జిల్లాRead more