నేడు విద్యుత్‌ సమస్యల ఫిర్యాదుల సదస్సు

ABN , First Publish Date - 2022-11-02T23:53:55+05:30 IST

శంకర్‌పల్లి మండలంలోని గ్రామాల్లో విద్యుత్‌ సమస్యలున్న వారు ఈ నెల 3న ఇబ్రహీంబాగ్‌ ట్రాన్స్‌కో సబ్‌డివిజన్‌ కార్యాలయంలో నిర్వహించే సదస్సులో సమస్యలపై అధికారుల దృష్టికి తేవాలని ట్రాన్స్‌కో ఏడీఈ రమేష్‌ బుధవారం తెలిపారు.

నేడు విద్యుత్‌ సమస్యల ఫిర్యాదుల సదస్సు

శంకర్‌పల్లి/కొత్తూర్‌, నవంబరు 2: శంకర్‌పల్లి మండలంలోని గ్రామాల్లో విద్యుత్‌ సమస్యలున్న వారు ఈ నెల 3న ఇబ్రహీంబాగ్‌ ట్రాన్స్‌కో సబ్‌డివిజన్‌ కార్యాలయంలో నిర్వహించే సదస్సులో సమస్యలపై అధికారుల దృష్టికి తేవాలని ట్రాన్స్‌కో ఏడీఈ రమేష్‌ బుధవారం తెలిపారు. ఉదయం 11 నుంచి మద్యాహ్నం 2గంటల వరకు శంకర్‌పల్లి, మొయినాబాద్‌, నర్సింగ్‌, పుప్పాలగూడ ప్రాంతాలకు వినియోగదారులు తమ సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చన్నారు. కొత్త కనెక్షన్లు, బిల్లులో తేడాలు, లో వోల్టేజీ తదితర సమ స్యలపై ఫిర్యాదులు చేయవచ్చన్నారు. కార్యక్రమంలో శంకర్‌పల్లి ఏఈ చక్రపాణి పాల్గొన్నారు. గురువారం విద్యుత్‌ వినియోగదారుల ఫిర్యాదులను స్వీకరిస్తున్నట్లు కొత్తూర్‌ ట్రాన్స్‌కో ఏడీఈ రవీందర్‌ తెలిపారు. కొత్తూర్‌, నందిగామ, కేశంపేట మండలాల వినియోగదారులు ఫిర్యాదు చేసుకోవచ్చని తెలిపారు. ఉదయం10:30 నుంచి ఒంటిగంట వరకు ఫిర్యాదులను స్వీకరిస్తామన్నారు.

Updated Date - 2022-11-02T23:53:55+05:30 IST
Read more