నేడు సూదిని జైపాల్‌రెడ్డి విగ్రహావిష్కరణ

ABN , First Publish Date - 2022-09-30T04:53:34+05:30 IST

కేంద్ర మాజీ మంత్రి, ఉత్తమ పార్లమెంటేరియన్‌ అవార్డు గ్రహీత,

నేడు సూదిని జైపాల్‌రెడ్డి విగ్రహావిష్కరణ

ఆమనగల్లు, సెప్టెంబరు 29: కేంద్ర మాజీ మంత్రి, ఉత్తమ పార్లమెంటేరియన్‌ అవార్డు గ్రహీత, కాంగ్రెస్‌ జాతీయ నేత దివంగత సూదిని జైపాల్‌రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం మాడ్గుల మండల కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు టీపీసీసీ కార్యదర్శి సూదిని రాంరెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కాయితి సాయిరెడ్డి తెలిపారు. మండల పరిషత్‌ కార్యాలయం సమీపంలో విగ్రహావిష్కరణ అనంతరం స్థానిక వాసవీ ఫంక్షన్‌ హాల్‌లో సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.సుభా్‌షరెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్‌రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మంద జగన్నాథ్‌, పార్లమెంట్‌ సభ్యులు పోతుగంటి రాములు, ఆర్‌.కృష్ణయ్య, ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్‌, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎన్‌బీసీ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి, మాజీ ఎంపీలు డాక్టర్‌ మల్లు రవి, సయ్యద్‌ అజీజ్‌ పాషా, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి హాజరవుతున్నట్లు రాంరెడ్డి, సాయిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్దసంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. 


Read more