పార్టీ కోసం శ్రమించిన వారందరికీ ఆదరణ

ABN , First Publish Date - 2022-11-30T00:18:25+05:30 IST

పార్టీ కోసం శ్రమించిన ప్రతీ కార్యకర్తకు ఆదరణ ఉంటుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు.

పార్టీ కోసం శ్రమించిన వారందరికీ ఆదరణ

యాచారం, నవంబరు 29: పార్టీ కోసం శ్రమించిన ప్రతీ కార్యకర్తకు ఆదరణ ఉంటుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మంగళవారం కేస్లీతండా కాంగ్రెస్‌ కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎ్‌సలో చేరారు. కార్యకర్తలు ఇల్లిల్లూ తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించాలన్నారు. గ్రామాల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించినట్లు చెప్పారు. టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కె.రమే్‌షగౌడ్‌, నాయకులు కె.యాదయ్యగౌడ్‌, శంకర్‌, కిషన్‌, యాదయ్యగౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T00:18:25+05:30 IST

Read more