ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీఎన్జీవో కృషి

ABN , First Publish Date - 2022-05-19T05:02:58+05:30 IST

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీఎన్జీవో కృషి

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీఎన్జీవో కృషి
నూతన కార్యవర్గంతో ప్రమాణస్వీకారం చేయిస్తున్న లక్ష్మణ్‌


చేవెళ్ల, మే 18: ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తెలంగాణ నాన్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ యూనియన్‌(టీఎన్జీవో) నిరంతరం పోరాడుతుందని టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షడు లక్ష్మణ్‌ అన్నారు. ఈఎన్జీవో చేవెళ్ల డివిజన్‌ కమిటీని బుధవారం మండల పరిషత్‌లో ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా అశోక్‌కుమార్‌ వ్యవహరించారు. యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పడుతున్న ఇబ్బందులు, ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరింపజేసేలా సంఘం పనిచేస్తోందన్నారు. నూతన కమిటీ టీఎన్జీవో పటిష్టతకు పాటుపడాలన్నారు. చేవెళ్ల డివిజన్‌ అధ్యక్షుడిగా ఇ.రాజ్‌కుమార్‌(ఇన్‌చార్జి ఎంపీడీవో), ఉపాధ్యక్షులు రవీందర్‌రెడ్డి(మండల సర్వేయర్‌), కార్యదర్శి డి.శ్యామ్‌రావ్‌(పీహెచ్‌సీ, షాబాద్‌),     ఎగ్జిక్యుటీవ్‌ కమిటీ మెంబర్లుగా పలువురిని ఎన్నుకున్నారు. 

Read more