వ్యక్తిపై దాడి కేసులో ముగ్గురి రిమాండ్‌

ABN , First Publish Date - 2022-10-12T05:10:04+05:30 IST

వ్యక్తిపై దాడి కేసులో ముగ్గురి రిమాండ్‌

వ్యక్తిపై దాడి కేసులో ముగ్గురి రిమాండ్‌

మోమిన్‌పేట్‌, అక్టోబరు 11: మండల పరిధిలోని రాళ్లగూడుపల్లికి చెందిన గౌండ్ల లక్ష్మీదా్‌సగౌడ్‌పై పాత కక్ష్యల నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన గొంగులూరి ఆశిరెడ్డి, ప్రసాద్‌గౌడ్‌లు సోమవారం కత్తితో దాడి చేసిన విషయం పాఠకులకు విధితమే. ఈ సంఘటనపై గౌండ్ల లక్ష్మీదా్‌సగౌడ్‌ సోదరుడు గౌండ్ల శ్రీకాంత్‌గౌడ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మోమిన్‌పేట్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడిన ఆశిరెడ్డి, ప్రసాద్‌గౌడ్‌లను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌ నిమిత్తం కోర్టుకు తరలించినట్లు సీఐ వెంకటేశం, ఎస్సై విజయప్రకాశ్‌ తెలిపారు. 24 గంటల్లో నిందితులను పట్టుకోవడంతో టాస్క్‌ఫోర్స్‌, మోమిన్‌పేట్‌ పోలీసు సిబ్బందిని సీఐ, ఎస్సై అభినందించారు.


Read more