జిల్లాకు మూడు బీసీ స్టడీ సెంటర్లు

ABN , First Publish Date - 2022-09-29T05:09:47+05:30 IST

విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం

జిల్లాకు మూడు బీసీ స్టడీ సెంటర్లు
తుక్కుగూడలో బస్తీదవఖానాను ప్రారంభిస్తున్న మంత్రి

  • విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి 


మహేశ్వరం, సెప్టెంబరు 28 : విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక గురుకులాలను ఏర్పాటు చేస్తుందని, అందులోభాగంగానే మహేశ్వరం, శేరిలింగంపల్లి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలకు స్టడీ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం మహేశ్వరంలో ఆమె మాట్లాడుతూ.. బీసీ నిరుద్యోగ యువతీ యువకులకు స్టడీ సెంటర్లు దోహదపడుతాయన్నారు. అర్హత ఉన్నవారు స్టడీ సెంటర్లలో చేరేందుకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అదేవిధంగా కందుకూరు మండలానికి బీసీ గురుకుల డిగ్రీ కళాశాల మంజూరైందని తెలిపారు.


సంపూర్ణ ఆరోగ్య తెలంగాణే లక్ష్యం

సంపూర్ణ ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని మంత్రి సబితారెడ్డి అన్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని మంఖాల్‌, తుక్కుగూడల్లో బస్తీ దవఖానాలను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. నగర శివారు ప్రాంతాల్లో నాలుగు సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేయాలన్న కృతనిశ్చయంతో కేసీఆర్‌ ఉన్నారని తెలిపారు. ఒక్కో ఆసుపత్రిని రూ.1200కోట్ల వ్యయంతో మహేశ్వరం, ఎల్‌బీనగర్‌ నియోజకవర్గాల పరిధిలో గడ్డి అన్నారం, మేడ్చల్‌, సనత్‌నగర్‌, గచ్చిబౌలిలలో వీటిని నెలకొల్పనున్నట్లు తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గంలో మొత్తం 10 బస్తీ దవఖానాలు మంజూరు కాగా ఇందులో 4 తుక్కుగూడ మున్సిపాలిటీలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం మహేశ్వరంలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి, ఎంపీపీ కె. రఘుమారెడ్డి, వైస్‌ఎంపీపీ ఆర్‌. సునిత అంద్యానాయక్‌, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎండీవో నర్సింహులు, తహసీల్ధార్‌ మహమూద్‌అలీ పాల్గొన్నారు. 

 

బతుకమ్మ పండగకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు

కందుకూరు : తెలంగాణ రాష్ట్రం వచ్చాక మహిళలకు గౌరవం పెంచుతూ... బతుకమ్మ పండగకు సీఎం కేసీఆర్‌ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకు వచ్చారని మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. బుధవారం కందుకూరు మండల పరిషత్‌ కార్యాలయంలో బతుకమ్మ చీరలను మహిళలకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 10లక్షల 10వేల చీరలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కందుకూరులో 35గ్రామాల మహిళలకు 16వేల చీరలను అందజేస్తున్నట్లు చెప్పారు. అనంతరం 11మందికి కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో జడ్పీచైర్‌పర్సన్‌ తీగల అనీతారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కప్పాటి పాండురంగారెడ్డి, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, ఎంపీపీ మంద జ్యోతి, గంగుల శమంతప్రభాకర్‌రెడ్డి, ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి, కాసుల రామక్రిష్ణారెడ్డి, గంగాపురం గోపాల్‌రెడ్డి, కాకి ఇందిరదశరథ, పల్లె వసంత కృష్ణగౌడ్‌, ఎస్‌,శమంతకమణి, శ్రావణి, శ్రీలత, పరంజ్యోతి, శ్రీనివాసచారి, గోవర్ధన్‌, బి.నరేందరంగౌడ్‌, పి.బాలమణిఅశోక్‌, ఇ.రాంచంద్రారెడ్డి, రజితప్రవీణ్‌, బి.జ్యోతి, శ్రీదేవిశేఖర్‌రెడ్డి, అనితాశ్రీనివాస్‌, శ్రీనివాస్‌, జి.కళమ్మరాజు, సదాలక్ష్మి, రాము, ఇందిరాదేవేందర్‌, సురేష్‌, రాములు ఉన్నారు.


దైవభక్తితో ముందుకు సాగాలి : జడ్పీ చైర్‌పర్సన్‌ 

దైవభక్తితో ప్రతిఒక్కరూ ముందుకు సాగాలని జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి పేర్కొన్నారు. బుధవారం కందుకూరులోని దుర్గామాత మండపం వద్ద జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మండల ఎంపీటీ సీల ఫోరం అధ్యక్షుడు ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారికి కుంకుమార్చన చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, నాయకులు కె.ప్రశాంత్‌చారి, కొలన్‌ విఘ్నేశ్వర్‌రెడ్డి, డి.రఘుబాబు, సందీప్‌, శేఖర్‌చారి, రామక్రిష్ణ పాల్గొన్నారు.



Updated Date - 2022-09-29T05:09:47+05:30 IST