ఆలయంలో చోరీ

ABN , First Publish Date - 2022-09-10T06:01:40+05:30 IST

ఆలయంలో చోరీ

ఆలయంలో చోరీ

చౌదరిగూడ, సెప్టెంబరు 9: ఆలయంలో చోరీ జరిగిన సంఘటన మండలంలోని ముష్ఠిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామ శివారులోని ఎల్లమ్మ దేవాలయం, గుట్టపై ఉన్న నరసింహస్వామి ఆలయంలోని హుండీని గుర్తు తెలియని వ్యక్తులు పగులగొట్టి పడేశారు. ప్రతి శుక్రవారం దేవాలయం వద్ద పూజాకార్యక్రమాలు నిర్వహించాడానికి గ్రామానికి చెందిన కన్న బాలమణి వేళ్లేది. శుక్రవారం పూజ చేయడానికి ఉదయం ఆలయానికి వెళ్లగా అక్కడ ఉన్న హుండీ తాళం పగలగొట్టి ఉండడాన్ని చూసి గ్రామస్థులకు సమాచారం ఇచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. గ్రామస్థుడు మల్లేష్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సక్రం తెలిపారు.

Read more