చేగిరెడ్డి ఘణపూర్‌లో చోరీ

ABN , First Publish Date - 2022-09-17T05:38:54+05:30 IST

చేగిరెడ్డి ఘణపూర్‌లో చోరీ

చేగిరెడ్డి ఘణపూర్‌లో చోరీ

చౌదరిగూడ, సెప్టెంబరు 16: జిల్లేడ్‌ చౌదరిగూడ మండల పరిధిలోని చేగిరెడ్డి ఘణపూర్‌లో గురువారం ఉదయం చోరీ జరిగింది. గ్రామానికి చేందిన షమీనా భేగం కుటుంబ పోషణ కోసం కూలి పనులకు వెళ్లేంది. గురువారం ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లింది. ఆమె కుమారుడు రోజూలాగే ఇంటికి తాళం వేసి కాలేజీకి వెళ్లాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసిరికి తలుపులు తెరిచి ఉన్నాయి. ఇంటిలో వెనుక వైపు ఉన్న ఇనుప డోరును కిందకు వంచి గుర్తుతెలియని దుండగులు ఇంటిలోపలికి దూరినట్లు గుర్తించారు. బీరువాను తెరిచి 3తులాల బంగారాన్ని చోరీ చేస చోరీ జరిగినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న ఏఎ్‌సఐ బాలస్వామి అక్కడికి చేరుకొని బాధితురాలిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Read more