ఉరేసుకొని యువకుడు మృతి

ABN , First Publish Date - 2022-08-31T06:07:58+05:30 IST

ఉరేసుకొని యువకుడు మృతి

ఉరేసుకొని యువకుడు మృతి

మేడ్చల్‌, ఆగస్టు 30 : ఉరేసుకొని ఓ యువకుడు మృతిచెందిన ఘటన మేడ్చల్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం మాసాయిపేట గ్రామానికి చెందిన సర్రాల రాకేష్‌(21) సోమవారం రాత్రి బైక్‌పై మేడ్చల్‌ మండలం నూతన్‌కల్‌లోని తన బావ తలారి బాలకృష్ణ వద్దకు వచ్చాడు. ఈమేరకు తాను మళ్లీ వస్తానని చెప్పి.. బావ ఇంటి నుంచి బయల్దేరిన రాకేష్‌ గౌడవెల్లి పరిధి ఓఆర్‌ఆర్‌ పక్కనే గల ఒక చెట్టుకు ఉరేసుకొని మృతిచెందాడు. మంగళవారం ఉదయం సమాచారం అందుకున్న రాకేష్‌ బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. రాకేష్‌ మృతికి ఆర్థిక ఇబ్బందులా? లేక వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read more