ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికే టికెట్‌

ABN , First Publish Date - 2022-12-13T00:13:44+05:30 IST

తాండూరు నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆయనకే కన్ఫర్మ్‌ అయిందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజుగౌడ్‌, బీఆర్‌ఎస్‌ తాండూరు పట్టణ అధ్యక్షుడు నయీం(అప్పు) అన్నారు.

ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికే టికెట్‌
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న రాజుగౌడ్‌, నయీం

తాండూరు రూరల్‌, డిసెంబరు 12: తాండూరు నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆయనకే కన్ఫర్మ్‌ అయిందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజుగౌడ్‌, బీఆర్‌ఎస్‌ తాండూరు పట్టణ అధ్యక్షుడు నయీం(అప్పు) అన్నారు. సోమవారం తాండూరులోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో బీఆర్‌ఎస్‌ అధికార ప్రతినిధి వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. రాజుగౌడ్‌ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే టికెట్‌ తనకే వస్తుందంటూ ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు. 49ఏళ్లలో జరగని అభివృద్ధిని రోహిత్‌రెడ్డి చేసి చూపుతున్నారన్నారు. నియోజకవర్గానికి రూ.134కోట్లతో పనులు, పెండింగ్‌ రైల్వే అండర్‌ బ్రిడ్జి, నర్సింగ్‌ కాలేజ్‌, బషీరాబాద్‌కు జూనియర్‌ కాలేజీ, తాండూరు మండలానికి ఐటీఐ, బీసీ/బంజారా/దళిత భవన్లు, 167వ జాతీయ హైవేకు నిధులు, రూ.27కోట్లతో తాండూరులో రోడ్ల విస్తరణ పనులు రోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో చేస్తున్నారన్నారు. దీంతో ఆయన గ్రాఫ్‌ పెరిగిందన్నారు. జినుగుర్తి శివారులో ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటుకు కృషిచేశారన్నారు.ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి 20ఏళ్ల నుంచి క్యాడర్‌ను పట్టించుకోలేదని, కొందరు ఎమ్మెల్యే వర్గంలో చేరితే వారికి పదవులు ఇప్పించారని చెప్పారు. దీన్ని జీర్ణించుకోలేక క్యాకర్తలను,ప్రజలను మభ్యపెట్టేందుకే మహేందర్‌రెడ్డి టికెట్‌ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు. సిట్టింగ్‌లకే టికెట్‌ అని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారని, అలాగే ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి తన పనితీరుతో కేసీఆర్‌ వద్ద టికెట్‌ కన్ఫర్మ్‌ చేసుకున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రోహిత్‌రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారన్నారు. రోహిత్‌రెడ్డి కోసం మహేందర్‌రెడ్డి పనిచేయడం ఖాయమన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ నాయకులు పట్లోళ్ల నర్సింహులు, శ్రీనివాసచారి, పోట్లి మహరాజ్‌ ఆలయ అధ్యక్షుడు రాజన్‌గౌడ్‌, ఉర్దూఘర్‌ చైర్మన్‌ రజాక్‌, నాయకులు ఇర్ఫాన్‌, టైలర్‌ రమేష్‌, జిలానీ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T00:13:44+05:30 IST

Read more