-
-
Home » Telangana » Rangareddy » The role of poets and artists in public awareness programs is crucial-NGTS-Telangana
-
ప్రజా చైతన్య కార్యక్రమాల్లో కవులు, కళాకారుల పాత్ర కీలకం
ABN , First Publish Date - 2022-09-19T05:49:36+05:30 IST
ప్రజా చైతన్య కార్యక్రమాల్లో కవులు, కళాకారుల పాత్ర కీలకం

కడ్తాల్, సెప్టెంబరు 18: ప్రజాచైతన్య కార్యక్రమాల్లో కవులు, కళాకారుల పాత్ర కీలకమని రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా కడ్తాల గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆదివారం సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి ఆధ్వర్యంలో 30మంది కవులు, కళాకారులు, కళాపోషకులకు సన్మానించి. జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కవి జ్ఞానప్రసూనశర్మ, వార్డుసభ్యులు, నాయకులు నాగిళ్ల మల్లయ్య, దోనాదుల మహేశ్, మంగళపల్లి నర్సింహ, గురిగళ్ల రామచంద్రయ్య, క్యామ వెంకటయ్య, రాంచందర్ నాయక్, మంకి శ్రీను పాల్గొన్నారు.