పోడుభూముల సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-07-18T05:30:00+05:30 IST

పోడుభూముల సమస్యలు పరిష్కరించాలి

పోడుభూముల సమస్యలు పరిష్కరించాలి

పూడూర్‌, జూలై 18 : పోడుభూముల సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సిహెచ్‌. బుచ్చన్న సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈమేరకు ఆయన మాట్లాడుతూ పోడుభూముల సమస్యలను పరిష్కరిస్తూ, అర్హులైన వారికి కొత్తగా పట్టా పాస్‌పుస్తకాలను అందించాలన్నారు. ఇటీవల  కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలు, ఇళ్లను అధికారులు పరిశీలించి ప్రభుత్వం ద్వారా పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 

Updated Date - 2022-07-18T05:30:00+05:30 IST