అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-09-20T05:02:11+05:30 IST

అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలి

అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలి

  •  సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామకృష్ణ,  ఉపాధ్యక్షుడు చంద్రయ్య

పరిగిరూరల్‌/కొడంగల్‌ రూరల్‌, సెప్టెంబరు 19: మినీ అంగన్‌వాడీ టీచర్లను మెయిన్‌ టీచర్లుగా గుర్తించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ , అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు కె.నర్సమ్మ డిమాండ్‌ చేశారు. సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో పరిగి ఐసీడీఎస్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీ టీచర్లు ధర్నా నిర్వహించారు.  టీచర్లకు ఉద్యోగ భద్రత, పెండింలో ఉన్న టీఏ,డీఏలు, తదితర బెనిపిట్స్‌ కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్‌ నాయకులు మంజుల, పార్వతమ్మ, శ్వేత, శాంతబాయి, విజయ, కవిత, కమల, బుజ్జిబాయి, కల్పన, ప్రమీల పాల్గొన్నారు.  అలాగే సీఐటీయూ వికారాబాద్‌ జిల్లా ఉపాధ్యక్షుడు బుస్స చంద్రయ్య ఆధ్వర్యంలో కొడంగల్‌ సీడీపీవో కార్యాలయం ఎదుట టీచర్లు ధర్నా చేసి, వినతి పత్రం అందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమస్యలను పరిష్కరించాలన్నారు.  కార్యక్రమంలో మహమ్మద్‌, ఆంజనేయులు, నర్సిములు, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Read more