-
-
Home » Telangana » Rangareddy » The party should be strengthened till the elections-NGTS-Telangana
-
ఎన్నికల వరకు పార్టీని బలోపేతం చేయాలి
ABN , First Publish Date - 2022-09-08T05:48:55+05:30 IST
ఎన్నికల వరకు పార్టీని బలోపేతం చేయాలి

యాచారం/షాబాద్, సెప్టెంబరు 7: వచ్చే ఎన్నికల వరకు టీఆర్‌ఎస్ పార్టీని బలోపేతం చేయాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మండలంలోని మంతన్‌గౌరెల్లి గ్రామానికి చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో బుధవారం టీఆర్‌ఎ్‌సలో చేరారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కె.రమే్‌షగౌడ్, సొసైటీ వైస్ చైర్మన్ యాదయ్య, నాయకులు ఓరుగంటి యాదయ్యగౌడ్, శంకర్‌నాయక్ పాల్గొన్నారు. అదేవిధంగా షాబాద్ మండలంలోని నాగర్‌గూడ, చిన్నసోలిపేట్ గ్రామాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు జడ్పీటీసీ పట్నం అవినా్‌షరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు నర్సింగ్‌రావు సమక్షంలో టీఆర్‌ఎ్‌సలో చేరారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీచైర్మన్ ఈదుల నర్సింహులుగౌడ్, సర్పంచులు ఈదుల కృష్ణగౌడ్, రమ్యకృష్ణ రాంచంద్రారెడ్డి, ఎంపీటీసీలు సునీతారామస్వామి, లతమైపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.