మైసిగండిలో కొనసాగుతున్న శరన్నవరాత్రులు

ABN , First Publish Date - 2022-10-05T04:58:01+05:30 IST

మైసిగండి శివరామాలయంలో దసరా శరన్నవరాత్రోత్సవాలు

మైసిగండిలో కొనసాగుతున్న శరన్నవరాత్రులు
మైసిగండిలో అమ్మవారి పూజల్లో భక్తులు

కడ్తాల్‌, అక్టోబర్‌ 4 : మైసిగండి శివరామాలయంలో దసరా శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో ఆలయానికి తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు. ఉత్సవాలలో భాగంగా 9వరోజు మంగళవారం శ్రీ అన్నపూర్ణేశ్వరి, మహాలక్ష్మి, జ్ఞాన సరస్వతి దేవిని శ్రీమహిషాసురమర్థిని దేవి అలంకారంలో పూజలు నిర్వహించారు.  ప్రముఖ వేదపండితుడు మురళీధర్‌శర్మ ఆధ్వర్యంలో అర్చకులు చండీ, గణపతి హోమాలు నిర్వహించారు. ఆలయ ఫౌండర్‌ట్రస్టీ రామావత్‌ సిరోలిపంతూ, ఈవో స్నేహలత ఆధ్వర్వంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు కొనసాగాయి. అమ్మవారి నామస్మరణతో మైసిగండి ఆలయం మార్మోగింది. కార్యక్రమంలో తహసీల్దార్‌ ఆర్‌.పి.జ్యోతి, ఉత్సవ కమిటీ నిర్వాహకుడు రామావత్‌ భాస్కర్‌, వాగ్దేవి, సర్పంచ్‌ తులసీరామ్‌ నాయక్‌, ఎంపీపీ కమ్లీమోత్యనాయక్‌, టీపీసీసీ సభ్యుడు ఆయిళ్ల శ్రీనివా్‌సగౌడ్‌, నాయకులు తదితరులు పాల్గొన్నారు. Read more