కేసీఆర్‌ కుటుంబంపై బురదజల్లే ప్రయత్నం మంచిది కాదు

ABN , First Publish Date - 2022-11-19T00:11:42+05:30 IST

బీజేపీకి టీఆర్‌ఎ్‌సను ఎదుర్కొనే శక్తి లేకనే కేసీఆర్‌ కుటుంబంపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని, ఇది మంచి పద్ధతి కాదని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కప్పాటి పాండురంగారెడ్డి అన్నారు.

కేసీఆర్‌ కుటుంబంపై బురదజల్లే ప్రయత్నం మంచిది కాదు

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కప్పాటి

రంగారెడ్డి అర్బన్‌, నవంబరు 18: బీజేపీకి టీఆర్‌ఎ్‌సను ఎదుర్కొనే శక్తి లేకనే కేసీఆర్‌ కుటుంబంపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని, ఇది మంచి పద్ధతి కాదని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కప్పాటి పాండురంగారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. మునుగోడు ఓటమిని తట్టుకోలేక సభ్యత మరిచి సంస్కారం లేకుండా కవితపై... ఎంపీ అరవింద్‌ నోరు పారేసుకోవడం సరైంది కాదన్నారు. తప్పుడు కూతలు కూస్తే.. తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

Updated Date - 2022-11-19T00:11:43+05:30 IST