విద్యార్థుల్లో స్ఫూర్తి నింపిన ‘గాంధీ’ సినిమా

ABN , First Publish Date - 2022-08-22T04:34:21+05:30 IST

గాంధీ సినిమా విద్యార్థుల్లో మంచి స్పూర్తిని నింపిందని

విద్యార్థుల్లో స్ఫూర్తి నింపిన ‘గాంధీ’ సినిమా

రంగారెడ్డి అర్బన్‌, ఆగస్టు 21 : గాంధీ సినిమా విద్యార్థుల్లో మంచి స్పూర్తిని నింపిందని జిల్లా  కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  ఈనెల 9వ తేది నుంచి జిల్లాలో ప్రదర్శించిన గాంధీ సినిమాను 3,17,086 మంది విద్యార్థులు తిలకించారని తెలిపారు. విద్యార్థుల్లో దేశభక్తిని స్వతంత్య్ర స్పూర్తిని పెంపొందింప చేసేందుకు ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 9 నుంచి 11 వరకు 16 నుంచి 21వ తేది వరకు సినిమా థియేటర్లలో గాంధీ సినిమాను ప్రదర్శించడం జరిగిందని తెలిపారు. మొదటి రోజు అత్తాపూర్‌లోని మంత్ర సినిమా హాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే్‌షకుమార్‌, మున్సిపల్‌ శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్‌కుమార్‌, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్త, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణలతో కలిసి తనిఖీ చేసిన అనంతరం విద్యార్థులతో కలిసి గాంధీ సినిమాను కొద్దిసేపు వీక్షించారు. జిల్లా వ్యాప్తంగా 44 థియేటర్లలో 98 స్కీన్‌లలో 255 పాఠశాలలకు చెందిన విద్యార్థులు గాంధీ సినిమాను తిలకించినట్లు వెల్లడించారు. ఈ సినిమా ద్వారా ఎంతో మంది విద్యార్థులు స్పూర్తి పొందారని కలెక్టర్‌ తెలిపారు. 


Updated Date - 2022-08-22T04:34:21+05:30 IST