ద్విచక్రవాహనానికి నిప్పంటించిన దుండగులు

ABN , First Publish Date - 2022-08-21T05:30:00+05:30 IST

ద్విచక్రవాహనానికి నిప్పంటించిన దుండగులు

ద్విచక్రవాహనానికి నిప్పంటించిన దుండగులు

కులకచర్ల, ఆగస్టు 21 : చౌడాపూర్‌ మండల పరిధిలోని మక్తవెంకటాపూర్‌ గ్రామంలో శనివారం రాత్రి గుర్తుతెలియని దుండుగులు బైక్‌(టీఎస్‌34 జి2418)కు నిప్పంటించారు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన విస్లావత్‌ దొడ్యానాయక్‌ కుమారుడు రాజునాయక్‌ తన బైక్‌ను రోజూలాగే ఇంటి ముందు పార్క్‌ చేసి నిద్రపోయాడు. అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై పెట్రోలు పోసి నిప్పంటించారు. గమనించిన కుటుంబసభ్యులు మంటలార్పే ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే బైక్‌ పూర్తిగా కాలిపోయింది. రాజునాయక్‌ ఆదివారం ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గిరి తెలిపారు. కాగా, గ్రామంలో సీసీ కెమెరాలు ఉండటంతో గుర్తుతెలియని వ్యక్తులు వైర్లను కత్తిరించారు.

Read more