విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-03-17T04:52:55+05:30 IST

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

షాబాద్‌, మార్చి 16: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతిచెందిన ఘటన షాబాద్‌ మండల పరిధిలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. కుమ్మరిగూడ గ్రామానికి చెందిన కుమ్మరి రాములు(45) అదే గ్రామంలో గొల్ల శ్రీశైలం నూతనంగా నిర్మిస్తున్న ఇంటికి నీళ్లు పట్టేందుకు వెళ్లాడు. అక్కడ ప్లగ్‌ తీస్తున్న క్రమంలో ఒక్కసారిగా విద్యుత్‌షాక్‌ రావడంతో రాములు అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌  తెలిపారు. 

Read more