Sri Aurobindo: అరవింద జయంతి.. ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ స్టడీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం

ABN , First Publish Date - 2022-11-24T22:10:52+05:30 IST

స్వాతంత్ర్య సమరయోధులు, ఆధ్యాత్మికవేత్త శ్రీ అరవిందుల150వ జయంతి వేడుకల్లో భాగంగా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ స్టడీ ఆధ్వర్యంలో నవంబర్ 24న రవీంద్ర భారతిలో(హైదరాబాద్) ప్రత్యేక కార్యక్రమం జరిగింది.

Sri Aurobindo: అరవింద జయంతి.. ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ స్టడీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం

స్వాతంత్ర్య సమరయోధులు, ఆధ్యాత్మికవేత్త శ్రీ అరవిందుల150వ జయంతి(Aurobindo 150th Birth Anniversary) వేడుకల్లో భాగంగా ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ స్టడీ(The Institute of Human Study) ఆధ్వర్యంలో ‘అరొ ఉత్సవ్’ పేరిట నవంబర్ 24న రవీంద్ర భారతిలో(హైదరాబాద్) ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కేంద్ర సంగీత్ నాటక్ అకాడమీ మాజీ డిప్యూటీ సెక్రెటరీ(డ్రామా) కిరణ్ భట్నాగర్, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా అరవిందుల వారి జీవిత విశేషాలతో ‘డివైన్ ఆదేశ్’(Divine Adesh) పేరిట ఓ నాటక ప్రదర్శన నిర్వహించారు. నిషుంబిత క్రియేషన్స్‌కు చెందిన డా. రామ్ మోహన్ హొలగుండి ఈ నాటకానికి దర్శకత్వం వహించారు. 19వ శతాబ్దం తొలి దశకంలో అరవిందుల జీవితంలో చోటుచేసుకున్న విశేష ఘట్టాలను ఈ నాటకంలో ఆవిష్కరించారు. బెంగాల్ విభజన, అరవిందుల వారి అరెస్టు, కలలో వాసుదేవుడు ఇచ్చిన దివ్య ఆదేశం తదితర అంశాలను ప్రదర్శించారు. ఇక కార్యక్రమం ముగింపులో భాగంగా.. అరవిందుల వారు 1947 ఆగస్టు 15న జాతిని ఉద్దేశించి చేసిన సందేశాన్ని కూడా వినిపించారు.

3.jpg4.jpg1.jpg

Updated Date - 2022-11-24T22:18:50+05:30 IST