గురువు ప్రాధాన్యం మరిచిపోలేనిది

ABN , First Publish Date - 2022-09-19T05:49:14+05:30 IST

గురువు ప్రాధాన్యం మరిచిపోలేనిది

గురువు ప్రాధాన్యం మరిచిపోలేనిది

కందుకూరు, సెప్టెంబరు 18: సమాజంలో గురువు ప్రాధాన్యం మరిచిపోలేనిదని సీబీఐ మాజీ  జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాల్లో భాగంగా ఆదివారం నగరంలో ఏర్పాటు చేసిన ‘గురు దేవో భవ’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో మండల కేంద్రానికి చెందిన సాతూరి కుమార్‌, ఇప్పలపల్లి స్వప్నలను ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేయగా వారికి అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్‌క్లబ్‌ జిల్లా మార్కెటింగ్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ జి.మహేంద్రకుమార్‌రెడ్డి, లయన్స్‌క్లబ్‌, జిల్లా గరవ్నర్‌ జె.రఘు, జి.చెన్నకిషన్‌రెడ్డి, హరినారాయణ, తాళ్ల అంజయ్య,  తీగల జగదీశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. 

Read more