ముగిసిన డెడ్‌లైన్‌!

ABN , First Publish Date - 2022-08-01T05:46:40+05:30 IST

ముగిసిన డెడ్‌లైన్‌!

ముగిసిన డెడ్‌లైన్‌!

  • మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ విషయంలో మిగిలింది మంత్రుల హామీనే..
  • మంత్రితో తాండూరు ఎమ్మెల్యే, ఎంపీతో వికారాబాద్‌ ఎమ్మెల్యే భేటీ

తాండూరు, జూలై 31: తాండూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రెండున్నరేళ్ల ఒప్పంద పదవీ కాలం గడువు జూలై 27తో ముగిసింది. చైర్‌పర్సన్‌ స్వప్న రాజీనామా చేయకపోవడంతో పార్టీలో ఉత్కంఠ నెలకొంది. అయితే రెండు రోజుల్లో ఒప్పందం మేరకు రాజీనామా చేయకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి జూలై 29న విలేకరుల సమావేశంలో హెచ్చరించారు. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఇచ్చిన గడువు కూడా ఆదివారంతో ముగిసింది. ఇప్పుడు ఎమ్మెల్యే ఏ స్టెప్‌ వేస్తార న్న విషయంపై పట్టణ టీఆర్‌ఎ్‌సలో ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా.. ఇప్పటికే మం త్రులు సబితారెడ్డి, తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ ఆగస్టు నెల 15వ తేదీకల్లా తాండూరు, వికారాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్లతో రాజీనామా చేయించి గతంలో ఈ పదవికి పోటీపడిన వారికి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వర్గానికి మంత్రులు ఇచ్చిన హామీ మేరకు చైర్‌పర్సన్‌తో రాజీనామా చేయిస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే విషయమై ఆదివారం ఎంపీ రంజిత్‌రెడ్డితో తాండూరు, వికారాబాద్‌ ఎమ్మెల్యేలు రోహిత్‌రెడ్డి, ఆనంద్‌ భేటీ కావాల్సి ఉండగా, వికారాబాద్‌ ఎమ్మెల్యే మాత్రం ఉదయం భేటీ అయినట్లు తెలిసింది. తిరిగి సాయంత్రం ఎంపీతో ఇద్దరు ఎమ్మెల్యేలు కావాల్సిన భేటీ వాయిదా పడింది. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, మంత్రి సబితారెడ్డిని కలిసి తాజా పరిణామాలపై చర్చించారు.

Read more