ధరలు పెంచడమే కేంద్రం పనిగా మారింది

ABN , First Publish Date - 2022-09-19T05:30:00+05:30 IST

ధరలు పెంచడమే కేంద్రం పనిగా మారింది

ధరలు పెంచడమే కేంద్రం పనిగా మారింది
ఎన్‌ఎ్‌ఫసీనగర్‌ మాజీ సర్పంచ్‌ పెర్సిబాయికి టీఆర్‌ఎస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న మంత్రి మల్లారెడ్డి

ఘట్‌కేసర్‌, సెప్టెంబరు 19: కేంద్ర ప్రభుత్వం ఎనిమిదేళ్ల పాలనలో ధరలు పెంచుతూ ప్రజల నడ్డీ విరవడం తప్ప చేసిందేమీ లేదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సోమవారం శివారెడ్డిగూడలోని బంధన్‌ ఫంక్షన్‌ హాల్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి సమక్షంలో ఎన్‌ఎ్‌ఫసీనగర్‌ మాజీ సర్పంచ్‌లు పెర్సిబాయి, రాజేష్‌, ఘట్‌కేసర్‌కు చెందిన మాధవరెడ్డి పలువురు కాంగ్రెస్‌ నాయకు లు టీఆర్‌ఎ్‌సలో చేరారు. కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం ప్రజలపై పన్నులు వేయడమే పనిగా పెట్టు కుందని మండిపడ్డారు. పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ చివరకు పాల ధరను సైతం పెంచారన్నారు. సోమవారం జవహర్‌నగర్‌ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన పాదయాత్ర జనంలేక వెలవెలబోయిందన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న కేసీఆర్‌ను జైలుకు పంపుతారా? అని ప్రశ్నించారు. దమ్ముంటే బీజేపీ ప్రభుత్వం నూతన పార్లమెంట్‌ భవనానికి అంబేద్కర్‌ పేరు పెట్టాలని సవాల్‌ చేశారు. కార్యక్రమంలో ప్రజ్రాతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Read more