భవిష్యత్తులో బీజేపీదే అధికారం

ABN , First Publish Date - 2022-03-23T05:13:17+05:30 IST

భవిష్యత్తులో బీజేపీదే అధికారం

భవిష్యత్తులో బీజేపీదే అధికారం
బీజేపీలో యువకులను చేర్చుకుంటున్న శ్రీవర్ధన్‌రెడ్డి, అందె బాబయ్య

షాద్‌నగర్‌ అర్బన్‌, మార్చి 22: దేశప్రధాని నరేంద్రమోదీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజాదరణ పొందుతున్న బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తుందని బీజేపీ షాద్‌నగర్‌ నియోజకవర్గం ఇన్‌చార్జి నెల్లి శ్రీవర్ధన్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. షాద్‌నగర్‌ బీజేపీ కార్యాలయంలో మంగళవారం నందిగామ మండలం మేకగూడ గ్రామ ముదిరాజ్‌ సంఘం అధ్యక్షుడు బండారు హరిప్రసాద్‌, రాసుల రాజే్‌షలు బీజేపీలో చేరారు. ఇరువురు యువకులకు శ్రీవర్ధన్‌రెడ్డి, అందె బాబయ్యలు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు అందె బాబయ్య, చేగు సుధాకరప్ప, భానుప్రసాద్‌, రవితేజ, సాయిప్రకాష్‌, నరసింహా పాల్గొన్నారు.

Updated Date - 2022-03-23T05:13:17+05:30 IST