రాజీవ్‌తోనే సాంకేతిక విప్లవానికి నాంది

ABN , First Publish Date - 2022-08-21T05:59:11+05:30 IST

రాజీవ్‌తోనే సాంకేతిక విప్లవానికి నాంది

రాజీవ్‌తోనే సాంకేతిక విప్లవానికి నాంది
రాజీవ్‌తోనే సాంకేతిక విప్లవానికి నాంది

పరిగి, ఆగస్టు 20: దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీతోనే దేశంలోసాంకేతిక విప్లవానికి నాందిపలికిందని డీసీసీ అధ్యక్షుడు, రామ్మోహన్‌రెడ్డి అన్నారు. రాజీవ్‌ జయంతి సందర్భంగా  శనివారం పరిగిలోని ఆయన నివాస గృహంలో రాజీవ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పరిగి ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ రాజీవ్‌ ఆశయసాధనకు కృషి చేయాలన్నారు. దేశం కోసం త్యాగం చేసిన ఘనత ఇందిరాగాంధీ కుటుంబానికే దక్కుతుందన్నారు.  డీసీసీ కార్యదర్శులు కె.హన్మంత్‌, కొమిరె రాం చంద్రయ్య, పరుశరాంరెడ్డి, విజయ్‌కుమార్‌రెడ్డి, బీఎస్‌ ఆంజనేయులు, ఇ.కృష్ణ, ఆంజనేయులు, శ్రీనివాస్‌, జగన్‌ పాల్గొన్నారు. 

 ధరలు పెంచి నడ్డి విరుస్తున్న ప్రభుత్వాలు

 ఽకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర ధరలు పెంచి  పేదలపై తీవ్ర భార మోతుపుతందని రామ్మోహన్‌రెడ్డి విమర్శించారు. ఽనిత్యవసర ధరల పెంపుపై  కాంగ్రెస్‌ చర్చా కార్యక్రమంలో భాగంగా శనివారం పరిగి ఆర్టీసీ బస్‌స్టేషన్‌లో ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేసి, మహిళలతో చర్చిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికారంలోకి రాగానే నిరుద్యోగం, ద్రవ్యోల్బణం అంతం చేస్తానని చేస్తాన్న మోదీ మాటమార్చారని ఆరోపించారు. బీజేపీ హయాంలో మునుపెన్నడు లేనివిధంగా నిరుద్యోగం, నిత్యవసర సరుకులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

Read more