దళితులను రాజులుగా చేయడమే సీఎం లక్ష్యం

ABN , First Publish Date - 2022-04-06T04:37:32+05:30 IST

దళితులను రాజులుగా చేయడమే సీఎం లక్ష్యం

దళితులను రాజులుగా చేయడమే సీఎం లక్ష్యం
అవుశాపూర్‌లో జగ్జీవన్‌రామ్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న మల్లారెడ్డి

  • జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడకల్లో మంత్రి మల్లారెడ్డి

ఘట్‌కేసర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 5:దళితులను రాజులుగా చేయడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని, అందుకే దళితబంధును ప్రవేశపెట్టారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. అవుశాపూర్‌లో బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహాన్ని అవిష్కరించారు. 50ఏళ్లు బడుగుల అభివృద్ధికి పనిచేసిన మహానీయుడు జగ్జీవన్‌రామ్‌ అని కొనియాడాడు. వంద పేద దళి త కుటుంబాలకు దళితబంధు అందజేశామన్నారు. రెండో ఫేజ్‌లో ప్రతీ నియోజకవర్గంలో 2000కుటుంబాలకు పథకాన్ని వర్తింపజేస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే నర్సింహారెడ్డి, ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, వైఎస్‌ ఎంపీపీ జంగ మ్మ, సర్పంచ్‌ కావేరి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పావని పాల్గొన్నారు.


  • రూ.10లక్షల సాయాన్ని రూ.50లక్షలు చేసుకోవాలి


మేడ్చల్‌, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): దళితబంధు కింద రూ.10 లక్షలు పొందిన లబ్ధిదారులు కష్టపడి వ్యాపారం చేసుకొని రూ.50లక్షలు సంపాదించాలని మంత్రి మల్లారెడ్డి అన్నా రు. మేడ్చల కలెక్టరేట్‌లో వంద మందికి దళితబంధు మంజూరు పత్రాలను అందిం చారు. మంత్రి మా ట్లాడుతూ.. దళితులను ధనవంతులను చేసేందుకే సీఎం కేసీఆర్‌ దళిత బంధును తెచ్చారన్నారు. రెండో విడత కలెక్టర్ల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక ప్రారంభమవుతుందన్నారు. దళిత ఓట్లతో ఎంతో మంది పదవు లు పొందారు గానీ వారికి చేసిందేమీ లేదన్నారు. దళిత పక్షపాతి కేసీఆరే అన్నారు. రిజర్వేషన్‌ వల్లే తాను పదవిని పొందానని ఈ సందర్భంగా శామీర్‌పేట జడ్పీటీసీ అనిత అన్నారు. అదనపు కలెక్టర్‌ శ్యాంసన్‌, ప్రజాప్రతినిధులు ఇందిర, సుజాత, కవిత, మాధవీలత, వెంకట్రాం రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్‌ బాలజీ, డీఆర్డీవో పద్మజారాణి పాల్గొన్నారు. 


  • దళితుల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ పెద్దపీట


మేడ్చల్‌: రాష్ట్రంలో దళితుల అభివృద్ధి, సంక్షేమానికి కేసీఆర్‌ పెద్దపీట వేస్తున్న కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మూడుచింతలపల్లి రైతు వేదిక వద్ద సర్పంచ్‌ జామ్‌ రవి సహకారంతో ఏర్పాటు చేసిన జగ్జీవన్‌రామ్‌ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దళితుల సంక్షేమానికే దళితబంధును ప్రవేశపెట్టి చరిత్రలోని లిచిపోయేలా అమలుచేస్తోందని మంత్రి అన్నారు. కాగా తమ అసైన్డ్‌ భూములకు ధర ణి పాస్‌బుక్‌లు ఇవ్వాలని మొరపెట్టుకుంటున్నా అధికారులు స్పందిం చడం లేదని మూడుచింతలపల్లి దళితులు మంత్రికి తెలిపారు. మంత్రి, తహసీల్దార్‌ రాజేశ్వర్‌రెడ్డి స్పందిస్తూ గతంలో పట్టాలు పొందిన అసైనీల కు త్వరలో ఆన్‌లైన్‌లో నమోదు చేసి పాస్‌బుక్‌లు ఇస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీలు హారికమురళీగౌడ్‌, ఎల్లుబాయి, జడ్పీటీసీ అనిత, శా మీర్‌పేట, మూడుచింతలపల్లి మండలాల టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు సుదర్శన్‌, మల్లేశ్‌గౌడ్‌, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.

Read more