ప్రజలకు మీరేం చేస్తారో చెప్పండి

ABN , First Publish Date - 2022-09-25T05:48:39+05:30 IST

ప్రజలకు మీరేం చేస్తారో చెప్పండి

ప్రజలకు మీరేం చేస్తారో చెప్పండి
ఆసరా పింఛన్‌ కార్డులను అందజేస్తున్న ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌

  • ప్రతిపక్షాలకు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ ప్రశ్న 

షాద్‌నగర్‌/కేశంపేట, సెప్టెంబరు 24: సీఎం కేసీఆర్‌ను గద్దె దించుతామంటున్న ప్రతిపక్షాలు ముందు ప్రజలకు వారేం చేస్తారో చెప్పాలని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ డిమాండ్‌ చేశారు. ఇతర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఈరెండు పార్టీలు అక్కడ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వివరాల గురించి వెల్లడించాలని కోరారు. ఫరూఖ్‌నగర్‌ మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు శనివారం ఆయన ఆసరా పింఛన్‌కార్డులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉచితాలను రద్దు చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేస్తోందని తెలిపారు. అలాచేస్తే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందా? అని ప్రశ్నించారు. అంబా నీ, అదానీలకు రూ.12లక్షల కోట్ల రుణాలను మాఫీ చేస్తే తప్పులేదు కానీ, పేదలకు ఉచిత పథకాలు అందజేస్తే తప్పా అని ఆయన నిలదీశారు. కేంద్రం ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో మరోసారి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఖాయమన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ వెంకట్‌రామ్‌రెడ్డి, ఎంపీపీ ఖాజా ఇద్రీస్‌, ఎంపీపీ వినయకుమార్‌, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. అలాగే కేశంపేట మండలం దత్తాయపల్లికి బస్సు నడపాలని ఆ గ్రామ విద్యార్థులు ఎక్లా్‌సఖాన్‌పేటలోని ఎమ్మెల్యే అంజయ్యను నివాసానికి వెళ్లి వినతిపత్రం అందజేశారు. దసరా సెలవుల తరువాత బస్సు నడిపేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎస్‌ఎంసీ చైర్మన్‌ సత్యం, మల్లేష్‌, నర్సింలు, భూపాల్‌, యాదయ్య, శేఖర్‌, బాలరాజు, చెన్నయ్య పాల్గొన్నారు. కేశంపేటకు చెందిన వ్యక్తికి రూ.60వేల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును ఆయన అందజేశారు. టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి, జమాల్‌ఖాన్‌, గోపాల్‌ పాల్గొన్నారు.

Read more