సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ నెంబర్‌వన్‌

ABN , First Publish Date - 2022-09-10T05:55:02+05:30 IST

సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ నెంబర్‌వన్‌

సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ నెంబర్‌వన్‌

నవాబుపేట, సెప్టెంబరు 9 : సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం నెంబర్‌ వన్‌ అని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని మైతాప్‌ఖాన్‌గూడ, ఎతిరాజ్‌పల్లి, తిమ్మారెడ్డిపల్లి, మాదిరెడ్డిపల్లి తదితర గ్రామాల్లో ఆసరా పింఛన్ల ప్రొసీడింగ్స్‌ను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు నాగిరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ రాంరెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ప్రశాంత్‌గౌడ్‌,  మైతాప్‌ఖాన్‌గూడ సర్పంచ్‌ అనితారంగారెడ్డి, పార్టీ సీనియర్‌ నాయకులు ఎల్‌.రంగారెడ్డి, ఆనంద్‌రెడ్డి, ఆర్‌.వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Read more