అనంతపద్మనాభుడికి సూర్యవాహన సేవ
ABN , First Publish Date - 2022-09-30T05:29:02+05:30 IST
అనంతపద్మనాభుడికి సూర్యవాహన సేవ
వికారాబాద్, సెప్టెంబరు 29: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలంపల్లిలోని అనంతపద్మనాభస్వామి ఆలయంలో విశేష పూజలు, సేవలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం స్వామి వారిని సూర్యవాహనంపై ఊగించారు. వర్షం కురిసిన నేపథ్యంలో ఆలయ ఆవరణలోనే సేవలు కొనసాగించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.